Power Cut in Gudiwada Govt Hospital: కృష్ణాజిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అర్ధరాత్రి అంధకారం నెలకొంది. విద్యుత్ సరఫరా ఆగిపోయినా.. హాస్పిటల్ సిబ్బంది జనరేటర్ ఆన్ చేయకపోవడంతో సుమారు రెండు గంటలకు పైగా చంటి పిల్లలు, రోగులు నరకయాతన అనుభవించారు. తమ దుస్థితిని రోగులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, వీడియోలు చూసిన జిల్లా స్థాయి అధికారులు స్పందించారు. జనరేటర్‌ను ఆన్ చేయమని హాస్పిటల్ సిబ్బందికి ఆదేశించారు. దీంతో అర్ధరాత్రి 11.30 గంటలకు సిబ్బంది జనరేటర్‌ను ఆన్ చేశారు. అప్పటివరకు సెల్ఫోన్ల వెలుగులోనే రోగులు, వారి కుటుంబ సభ్యులు ఉండాల్సి వచ్చింది. రాత్రి వేళల్లో విద్యుత్ పోయినా సిబ్బంది జనరేటర్ ఆన్ చేయడంలేదని, తరచూ ఇలానే జరుగుతున్నా హాస్పటల్ అధికారులు పట్టించుకోవటం లేదంటూ రోగులు వాపోయారు.
power cut in area Hospital: అంధకారంలో నర్సాపురం ఏరియా ఆసుపత్రి.. అల్లాడిపోయిన రోగులు
Power Cut in AP Govt Hospitals: కాగా విద్యుత్ సరాఫరా నిలిచిపోవటంతో ఆస్పపత్రిలోని రోగులు అంధకారంలో అల్లాడిపోయిన ఘటన ఇటీవలే మరొకటి చోటుచోసుకుంది. సాయంత్రం 5 గంటలకు కరెంట్ సరఫరా నిలిచిపోగా.. రాత్రి 10 గంటల వరకు విద్యుత్తు పునరుద్ధరణ జరగలేదు. దీంతో సెల్ ఫోన్ల వెలుగులోనే రోగులు, వారి కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లబుచ్చారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం ఏరియా ఆసుపత్రిలో జరిగింది. హాస్పిటల్‌లోని విద్యుత్ సరఫరా లైన్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో కరెంట్ సరఫరా నిలిపోయింది.
Patients Suffering due to No Electricity in Hospital: హాస్పిటల్లో ఏడుగురు బాలింతలు, వారి చిన్నారులు, మరో పదమూడు మంది ఇన్ పేషెంట్లు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ఫ్యాన్లు తిరగక పోవడంతో వీరిపై దోమలు దండెత్తాయి. ఆసుపత్రిలో వారు, వారి సహాయకులు, ఆసుపత్రిలో విధులు నిర్వర్తించిన వైద్య సిబ్బంది ఓ వైపు ఉక్కబోత, మరోవైపు దోమలతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రోజుల వయస్సున్న చిన్నారులు విలవిలాడటంతో వారిని చూస్తూ మాతృమూర్తులు విలవిల్లాడారు.
Power Cuts in AP Hospitals: దీనిపై హాస్పిటల్ ఇంఛార్జి పర్యవేక్షకుడు కేఎస్ త్రిమూర్తులు, వైద్య సిబ్బంది స్పందించి.. జనరేటర్ ఆన్ చేసేందుకు ప్రయత్నించారు. వారు ఎంత ప్రయత్నించినా.. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా సాధ్యపడలేదు. హాస్పిటల్‌కు చెందిన ఎలక్ట్రిషియన్ వారానికి మూడు రోజులు ఈ ఆస్పత్రిలో, మూడు రోజులు తణుకులోని ఏరియా హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. హాస్పిటల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో.. మూడు రోజులపాటు ఆ ఉద్యోగి తణుకులో విధులు నిర్వహిస్తుండటంతో ఆయన.. నరసాపురం ఏరియా ఆసుపత్రిలో మరమ్మతులు నిర్వహించటం వీలుకాలేదు. దీంతో హాస్పిటల్ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో విద్యుత్ మరమ్మతులు నిర్వహించారు. దీనికి విద్యుత్తుశాఖ పట్టణ ఏఈ కె. ప్రభాకరరావు సిబ్బందితో కలిసి వచ్చి సహకారం అందించారు.
Medicines Shortage In Govt Hospitals: ఆస్పత్రిలో మందులేవి జగనన్న..?పడకేసిన ప్రభుత్వాసుపత్రులు