ETV Bharat / state

ఆగిన బతుకు చక్రం.. ఆదుకోవాలని వినతి

లాక్ డౌన్ నేపథ్యంలో చేతి వృత్తుల్లో భాగమైన కుండల తయారీ విక్రయాలు పూర్తిగా నిలిచిపోవడం ఆ వృత్తిదారులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో శ్రీ తిరుపతమ్మ దేవాలయం వద్ద కుండల చేసుకుంటూ జీవనం సాగిస్తున్నవారు. ప్రస్తుతం వీరికి పనిలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు.

Pottery Hand workers protest
ఉపాధి కోల్పోయిన కుమ్మరుల ఆందోళన
author img

By

Published : May 29, 2020, 7:09 AM IST

రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో శ్రీ తిరుపతమ్మ దేవాలయం తల్లికి పూజలు చేయాలంటే ముందుగా అమ్మవారికి మట్టితో చేసిన కుండల్లో పొంగళ్ళు చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈ గ్రామంలో 60 కుటుంబాలు కుమ్మరి చేతి వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు. దేవాలయం వద్ద కుండలు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. లాక్​డౌన్​తో ఆలయం మూతపడింది. దీంతో ఇక్కడ అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న తరుణంలో అనాధిగా వస్తున్న కుమ్మరి చేతివృత్తుల వారికి చేయూత ఇచ్చి ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇవీ చూడండి...

సీజన్‌ వ్యాధులు.. ముందు ముందు మరిన్ని సమస్యలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.