ETV Bharat / state

Postal Cover: చరిత్ర ఉట్టిపడేలా తపాలా శాఖ కవర్లు

Post office covers: చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తపాలా శాఖ కవర్లు ముద్రిస్తున్నట్లు విశాఖ పోస్ట్​ మాస్టర్ జనరల్ డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. భారత తపాలా శాఖ స్టాంపులు, ప్రత్యేక తపాలా కవర్లను విడుదల చేస్తూ... ఫిలాటెలీ హాబీని పరిచయం చేస్తోందన్నారు.

new Postal covers in vishaka
సంస్కృతి ప్రతిబింబించేలా పోస్టల్​ కవర్లు
author img

By

Published : Mar 1, 2022, 2:13 PM IST

Post office covers: మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యతు తరాలకు అందించేందుకు తపాలాశాఖ తపాలా కవర్లు ముద్రించి, విడుదల చేస్తున్నట్లు విశాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు తెలిపారు. భారత తపాలా శాఖ స్టాంపులు, ప్రత్యేక తపాలా కవర్​ను విడుదల చేస్తూ.. ఫిలాటెలీ హాబీని పరిచయం చేస్తోందన్నారు. ఫిలాటెలీ విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు వినోదాన్ని కూడా పంచుతోందన్నారు. ఈ మేరకు విజయవాడలో భారతీయ తపాలా శాఖ ముద్రించిన ఆచార్య ఆర్ఆర్కే మూర్తి ప్రత్యేక తపాలా కవర్​ను విడుదల చేశారు.

ఫిలాటెలీ అనేది పాఠశాల విద్యార్థుల్లో ప్రోత్సహించాలని వర్క్​షాప్​లు నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సబ్జెక్టు ద్వారా అనేక విషయాలపై తపాలా కవర్లు విడుదల చేశారని, చారిత్రక, సంప్రదాయాలు, వింతలు, విడ్డూరాలు, పంచారామాలు,... అరుదైన పక్షులు, జంతువులూ, మడ అడవులు, ఆజాదికా అమృత మహోత్సవాల్లో భాగంగా అనేకమంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలతో తపాలా కవర్లు విడుదల చేశారన్నారు.

ఇదీ చదవండి:

Ayyanna: జగన్ అవినీతి పనులను వ్యతిరేకిస్తున్నందుకే నాపై కక్ష: అయ్యన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.