ETV Bharat / state

నవరసనటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతి.. పలువురు సంతాపం - కైకాల మృతి పట్ల చంద్రబాబు సంతాపం

CONDOLENCE TO KAIKALA : ప్రజల నుంచి నవరసనటనా సార్వభౌమ బిరుదు అందుకున్న కైకాల సత్యనారాయణ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కైకాల మరణం సినీ పరిశ్రమతో పాటు రాజకీయ రంగంలో తీవ్ర విషాదంలో నింపిందని వారు ఆవేదన వ్యక్తం చేెశారు. ఆయన ఆత్మశాంతి కోసం భగవంతుడ్ని కోరుకుంటూ.. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

CHANDRABABU CONDOLENCE ON KAIKALA
CHANDRABABU CONDOLENCE ON KAIKALA
author img

By

Published : Dec 23, 2022, 10:46 AM IST

CHANDRABABU CONDOLENCE ON KAIKALA DEATH : విభిన్న పాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా అభిమానులచేత నవరస నటనాసార్వభౌమ అనిపించుకున్న మేటి నటులు, టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ మరణం విచారకరమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. సత్యనారాయణ ఆరు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్​తో ఆయనకున్న అనుబంధం సొంత అన్నదమ్ముల బంధం కన్నా ఎక్కువ అని గుర్తు చేశారు. సత్యనారాయణ మరణం సినీ రంగానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మ శాంతికై ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • సత్యనారాయణగారి మరణం సినీరంగానికి తీరని లోటు. ఆయన ఆత్మ శాంతికై ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

    — N Chandrababu Naidu (@ncbn) December 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విలక్షణ నటనతో విభిన్న పాత్రలకు జీవం: సీనియర్ నటుడు, మాజీ ఎంపీ, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం తెలిపారు. విలక్షణ నటనతో విభిన్న పాత్రలకు జీవం పోసిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని కోరుకుంటూ.. కైకాల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  • సీనియర్ నటులు, మాజీ ఎంపీ, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి మృతి విచారకరం. విలక్షణ నటనతో విభిన్న పాత్రలకు జీవం పోసిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/5Z83OUBkhf

    — Lokesh Nara (@naralokesh) December 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ : ఆహార్యం, అభినయం, ఆంగికాల కలబోత కైకాల నటన అని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ మరణం చిత్ర పరిశ్రమతోపాటు, తెలుగువారికి తీరనిలోటన్నారు. తెలుగు సినీవినీలాకాశం ఒకగొప్ప ధ్రువతారను కోల్పోవడం విచారకరమని తెలిపారు. ఎన్టీఆర్ వంటి మహానుభావుడితో కలిసి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కైకాల చూపిన అభినయం ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నటనా రంగంలో ఆయనకు ఆయనే సాటి: నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ భౌతికంగా దూరం కావడం సినీరంగంతో పాటు రాజకీయ రంగాన్ని తీవ్ర విషాదంలో నింపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కైకాల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నటనా రంగంలో ఆయనకు ఆయనే సాటి అని.. అందుకు ఆయనకు వచ్చిన అవార్డులే సాక్ష్యమని పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యుడుగా రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తి దాయకమని కొనియాడారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.