దళిత డాక్టర్ సుధాకర్ పరిస్థితికి సీఎం జగన్ కారకుడని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. జగన్ కుట్రలో భాగంగానే సుధాకర్‌ను పిచ్చివాడిగా చిత్రించాలని ప్రభుత్వం యత్నించిందని విమర్శించారు. మద్యపానమే సేవించని సుధాకర్ తాగుబోతు ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు.
హోంమంత్రికి చిత్తశుద్ధి, నైతిక విలువలుంటే రాజీనామా చేయాలని వర్ల డిమాండ్ చేశారు. దళిత డాక్టర్ సుధాకర్‌పై దాడి జరిగితే వైకాపా మంత్రులు సిగ్గుపడాలన్నారు. నర్సీపట్నం ఆసుపత్రిలో సుధాకర్‌ను తిరిగి నియమించాలని... కక్షపూరితంగా చేసిన సస్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
సుధాకర్ కుటుంబానికి ఏమి జరిగినా ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని వర్ల స్పష్టం చేశారు. సుధాకర్‌పై దాడిని తెదేపా, దళిత వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్న వర్ల... ఆతనిని స్వేచ్ఛగా జీవించేలా సీఎం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీచూడండి. పోతిరెడ్డిపాడుపై తెదేపా మౌనమెందుకు?: మంత్రి అనిల్