కృష్ణా జిల్లా ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామం వద్ద ఓ లారీలో అక్రమంగా నలభై గోవులను తరలిస్తుండగా... పోలీసులు పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణం నుంచి గుంటూరు జిల్లా వినుకొండకు మూగ జీవాలను తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
హైవే మీద నుంచి వెళితే తనిఖీలు ఎక్కువగా ఉంటాయని... రహస్య మార్గాల ద్వారా అక్రమరవాణా చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సహకారంతో మూగజీవాలను ద్వారకాతిరుమల దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ఇదీ చూడండి: