మంత్రి పేర్ని నానిపై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. పోలీసులు నిన్న నలుగురిని 4 గంటలపాటు ప్రశ్నించారు. దాడికి ముందు మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఈ నలుగురు వ్యక్తులు అనుమానస్పదంగా తిరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇవాళ కూడా విచారణకు హాజరుకావాలని వారిని పోలీసులు ఆదేశించారు.
కస్టడీకి కోరే అవకాశం
నిందితుడు తాపీమేస్త్రి బడుగు నాగేశ్వరరావు ఫోన్ కాల్స్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు రెక్కీ నిర్వహించాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగినరోజు మంత్రిని నిందితుడు నాగేశ్వరరావు అనుసరించినట్లు గుర్తించారు. అతడిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంది.
ఆదివారం ఉదయం మంత్రి పేర్ని నాని తన నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో.. బడుగు నాగేశ్వరరావు తాపీతో దాడికి యత్నించాడు. ఈ ఘటనలో మంత్రికి తృటిలో ప్రమాదం తప్పింది. వెంటనే మంత్రి గన్‌మెన్, అనుచరులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: