పంచాయతీ ఎన్నికల దృష్ట్యా కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలోని నాటుసారా స్థావరాలపై నూజివీడు డీఎస్పీ ఆధ్వర్యంలో.. పోలీసుల మెరుపు దాడులు నిర్వహించారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశానుసారం ఈ దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు.
292 తెలంగాణ మద్యం బాటిళ్ల స్వాధీనం..
చొప్పరమెట్ల గ్రామంలోని మామిడితోటలో తెలంగాణ మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న సమాచారంతో.. ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు. అతని నుంచి 292 తెలంగాణ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
9 వేల లీటర్ల బెల్లం ఊటల ధ్వంసం..
సింహాద్రి అప్పారావుపేట గ్రామ శివారులోని అడవిలో నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5 నాటు సారా తయారీ బట్టీలను, 9000 లీటర్ల బెల్లం ఊటలను పోలీసులు ధ్వంసం చేశారు. 100 కిలోల యూరియా, అమ్మోనియం, 30 లీటర్ల నాటుసారా, డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తయారీదారులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
పెద్దిరెడ్డికి జైలు జీవితం తప్పదు: మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి