కృష్ణాజిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడు వద్ద పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా కలపాల కృపాకర్ (30) అనే వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. పోలీసులు బాధితుడిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కొట్టడం వల్లే కృపాకర్ మృతి చెందాడని మృతుని బంధువులు ఆరోపించారు. రూరల్ పోలీస్ స్టేషన్ ముందు మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇవీ చూడండి...