గంజాయిని విక్రయిస్తున్న సతీశ్ అనే రౌడీషీటర్‌ను విజయవాడ అజిత్‌సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల నగర బహిష్కరణ చేసినప్పటికీ నగరంలోని దేవినగర్ కట్టవద్ద గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో సతీష్ పై 21 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి