ETV Bharat / state

తెదేపా ఓటమిని తట్టుకోలేక వ్యక్తి మృతి - కృష్ణా

తెదేపా ఓటమిని తట్టుకోలేక కృష్ణా జిల్లా నడకుదురుకు చెందిన మధుసూదనరావు అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాలేకపోతున్నారనే విషయాన్ని జీర్ణించులేక మృతిచెందాడు.

తెదేపా ఓటమిని తట్టుకోలేక వ్యక్తి మృతి
author img

By

Published : May 26, 2019, 10:51 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమిని తట్టుకోలేక ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చల్లపల్లి మండలం నడకుదురు గ్రామానికి చెందిన పీతా మధుసూదనరావు ఆటో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. అతను తెదేపా వీరాభిమాని. ఈనెల 23న వెలువడిన ఎన్నికల ఫలితాలు చూసి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాలేకపోతున్నారని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మరుసటి రోజు గుండెపోటు వచ్చి విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ నేడు మృతిచెందాడు.

ఇవీ చదవండి..

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమిని తట్టుకోలేక ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చల్లపల్లి మండలం నడకుదురు గ్రామానికి చెందిన పీతా మధుసూదనరావు ఆటో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. అతను తెదేపా వీరాభిమాని. ఈనెల 23న వెలువడిన ఎన్నికల ఫలితాలు చూసి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాలేకపోతున్నారని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మరుసటి రోజు గుండెపోటు వచ్చి విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ నేడు మృతిచెందాడు.

ఇవీ చదవండి..

వేరే మహిళతో భర్త సహజీవనం... భార్య మౌనదీక్ష

Intro:Ap_Nlr_01_25_Saraswathi_Nilayamga_Municipal_College_Kiran_Pkg_C1

యాంకర్: కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఉత్తమ విద్య, అత్యుత్తమ ఫలితాలతో దూసుకుపోతోంది నెల్లూరు మున్సిపల్ జూనియర్ కళాశాల. ప్రారంభం నుంచి నూటికి నూరుశాతం ఫలితాలు సాధిస్తూ, ప్రభుత్వ కళాశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆర్థిక స్థోమత లేక చదువుకు దూరమయ్యే పేద విద్యార్థుల పాలిట సరస్వతి నగరంగా పేరుగాంచిన ఈ కళాశాలపై ఈటీవీ ప్రత్యేక కథనం.
వి.ఓ.1:- పేదరికం కారణంగా చదువుకు దూరమై విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో చక్కటి విద్యను అందిస్తోంది నెల్లూరు మున్సిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల. మాజీ మంత్రి నారాయణ ఆలోచనలతో గత ప్రభుత్వం 2017లో ఈ కళాశాలను ప్రారంభించింది. మొదటి ఏడాది 49 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల ప్రణాళికాబద్ధంగా విద్యను అందించింది. నగరపాలక సంస్థతోపాటు, నారాయణ విద్యా సంస్థలు విద్యార్థులు కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పించాయి. ఫలితంగా మొదటి ఏడాది 49 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 32 మంది పది కి పది పాయింట్లు సాధించగా, మిగిలిన వారు 9.8 పాయింట్లు సాధించి ప్రభుత్వ కళాశాల లోనే అరుదైన ఘనత సాధించారు. అదే ఒరవడితో ఈ ఏడాది 166 మంది విద్యార్థులు పరీక్ష రాయగా నూటికి నూరుశాతం ఫలితాలు సాధించారు. వీరిలోనూ 55 మంది విద్యార్థులు పది పాయింట్లు సాధించి తమ ప్రతిభను చాటారు. ఇక్కడ విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమైన తర్ఫీదు ఇస్తున్నారు. ఈ ఏడాది 35మంది విద్యార్థులు ఐఐటి, జేఈఈ మెయిన్స్ లాంటి పోటీ పరీక్షలకు హాజరు కాగా, ఈ పరీక్షల్లోనూ 24 మంది అర్హత సాధించారు. ఉత్తమ విద్యా బోధనతోపాటు విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పిస్తున్నారు. నిరుపేద విద్యార్థులు ఎంతో మంది ఇక్కడ విద్యనభ్యసించి తమ జీవితాలకు బంగారు బాటలు వేసుకుంటున్నారు.
బైట్: అపర్ణ, విద్యార్థిని, గుంటూరు.
శృతి, విద్యార్థిని, వెంకటగిరి.
గిరిధర్, విద్యార్థి, నెల్లూరు.
వి.ఓ.2:- ఈ కళాశాలలో సీటు పొందేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి విద్యార్థులను చేర్చుకోగా, ఈ ఏడాదికి కేవలం నెల్లూరు జిల్లా విద్యార్థులకే అవకాశం కల్పించారు. పేదరికమే ప్రామాణికంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే ఉత్తమ విద్యార్థులకే కళాశాలలో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు గానీ, ఆర్థిక స్తోమత బాగుండే పిల్లలను గానీ కళాశాలలో సీటు రాదని కళాశాల డీన్ వెంకట్రావు తెలిపారు. ఈ ఏడాది 120 మంది విద్యార్థులను కళాశాలలో చేర్చుకొనున్నట్లు ఆయన వెల్లడించారు.
బైట్: డి. వెంకట రావు, మున్సిపల్ జూనియర్ కళాశాల డీన్, నెల్లూరు.
వి.ఓ.3:- నిరుపేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన కళాశాల, ఆ లక్ష్యసాధన దిశగా దూసుకుపోతోంది.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.