విజయవాడలోని పాయకాపురంలో ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎరుకల సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వీరి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామనీ.. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని చదివించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి.. కొత్త సీసాలో పాతసారా... బడ్జెట్‌పై ''కళా'' వ్యంగ్యాస్త్రాలు