ETV Bharat / state

నిలిచిన రహదారి పనులు... దుమ్మూధూళితో సమస్యలు - mopidevi

కొన్ని ప్రాంతాల్లో రహదారులు ప్రమాదానికి కారణమవుతుంటే... మరికొన్ని అధ్వాన్న నిర్వహణ ఫలితంగా అనారోగ్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటిదే మచిలీపట్నం నుంచి మోపిదేవి వరకు విస్తరించి ఉన్న 216వ జాతీయ రహదారి. విస్తరణలో భాగంగా అరకొరగా వదిలేసిన పనులతో ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. గాల్లోకి ఎగస్తున్న దుమ్ముతో అనారోగ్యంపాలవుతున్నారు.

దుమ్ము, దూళి
author img

By

Published : Jul 14, 2019, 4:23 PM IST

సగంలో నిలిచిన రహదారి పనులు... దుమ్మూ ధూళితో సమస్యలు..

జాతీయ రహదారిని తవ్వి వదిలేశారు. ఒకటి కాదు రెండు కాదు. నెలలు గడుస్తోంది. అయినా పట్టించుకునేవారు లేరు. ఫలితంగా.. దుమ్మూధూళి గాల్లోకి ఎగుస్తోంది. ప్రజలను ఆనారోగ్యానికి గురి చేస్తోంది. అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారి పక్కనే ఉన్న మత్స్యకారుల బాలుర ఆశ్రమ పాఠశాల, వసతి గృహంలోకీ దుమ్ము వెళ్తోంది. ఫలితంగా సుమారు 250 మంది ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి మోపిదేవి వరకు విస్తరించి ఉన్న 216వ జాతీయ రహదారి పరిధిలో ఈ పరిస్థితి నెలకొంది.

ఎన్నిసార్లు జాతీయ రహదారి అధికారులకు, గుత్తేదారుకు ఉపాధ్యాయులు, గ్రామస్తులు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది. వారానికి ఒకటి రెండు సార్లు దుమ్మురేగకుండా నీళ్ళు చల్లుతున్నా.. ఆ ఫలితమూ నామమాత్రమే. ధూళితో సరిగా చదువుకోలేక పోతున్నామని, ఊపిరి ఆడటం లేదంటున్నారు ఆశ్రమపాఠశాల విద్యార్థులు. భోజనం చేయలంటే ప్లేట్‌ దుమ్ముతో నిండిపోతోందని... బట్టలు ఉతికి ఎండ బెట్టినా తిప్పలు తప్పడం లేదంటున్నారు. సమస్యను త్వరగా శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి

నాడు కళకళ.. నేడు నిర్లక్ష్యంతో వెలవెల

Kathua (JandK), July 14 (ANI): An elderly couple was allegedly murdered by their own grandson in Jammu and Kashmir's Kathua on Saturday. While speaking to ANI, Shridhar Patil, SP Kathua said, "We have nabbed the prime suspect, he is being interrogated. FIR has been registered; further investigation in the case is underway."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.