తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మవారి మండల దీక్ష మాలాధారణ కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తెల్లవారుజామున ఐదు గంటలకు దీక్ష దారులకు ఆలయంలో మాలలు వేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు కార్యక్రమం నిర్వహించనున్నారు. మండల దీక్షలు తీసుకున్న భక్తులు 45 రోజులపాటు నిష్ఠతో దీక్షలు పూర్తిచేసి.. తిరిగి ఇరుముడులు సమర్పించనున్నారు.
అదే రోజే అమ్మవారికి నిర్వహించే కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. ఈ ఏడాది కొవిడ్ కారణంగా ఆలయం వద్ద పటిష్టమైన నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పదేళ్ల లోపు చిన్నారులకు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆలయంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈసారి వారు మాలలు వేసుకునేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు.
ఇవీ చూడండి: