ETV Bharat / state

శాంతిస్తున్న కృష్ణమ్మ..తగ్గుముఖం పట్టిన వరద - ప్రకాశం బ్యారేజ్

కృష్ణానదికి వరద ప్రవాహం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది... శ్రీశైలం, నాగర్జున సాగర్ జలశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. వరద నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేయటంతో లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

శాంతిస్తున్న కృష్ణమ్మ
author img

By

Published : Aug 17, 2019, 3:44 PM IST

శాంతిస్తున్న కృష్ణమ్మ

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. 10 గేట్ల ద్వారా 6 లక్షల 35 వేల క్యూసెక్కుల నీరు సాగర్​కు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 7 లక్షల 55 వేల క్యూసెక్కుల నీరు ఉండగా..ఔట్ ఫ్లో 7లక్షల 48 వేల క్యూసెక్కుల మేర ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.50 అడుగుల నీటిమట్టం ఉంది. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38 వేల 140 క్యూసెక్కులు విడుదలవుతుండగా.. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31వేల 349 క్యూసెక్కులు విడుదలైంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1600 క్యూసెక్కులు విడుదల చేయగా.. హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కుల నీరు విడుదలయ్యింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 40 వేల క్యూసెక్కులు విడుదలయ్యింది.

ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఇన్ ఫ్లో 7లక్షల 57 వేల క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 7లక్షల 92 వేల క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం 4టీఎంసీల వరద నీరు ఉండగా.. పూర్తి నీటి నిల్వ 3.07 టీఎంసీలు ఉన్నది. బ్యారేజీ 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీరు చేస్తున్నారు.

Intro:kit 736
అవనిగడ్డ నియోజక వర్గం.

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం , కొక్కిలిగడ్డ కొత్త పాలెం హరిజనవాడ లో ఇప్పటికి 40 గృహాలు నీటమునిగాయి వందలాది ఎకరాల్లో పసుపు అరటి, మొక్కజొన్న , పంటలు నీట మునిగాయి , కొక్కిలిగడ్డ హరిజనవాడలో నివాసగృహాలు ఖాళీ చేసినవారు పక్కనే ఉన్న కృష్ణా కరకట్ట చెట్ల కింద ఉంటున్నారు. కరకట్ట పై వెళ్లే వాహనాల వల్ల తమకు తమ పిల్లలకు ఏమన్నా జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు
మోపిదేవి మండలం బొబ్బర్లంక లో కూడా వరద వరదనీరు గంట గంట పెరుగుతూ పసుపు మొక్కజొన్న బెండ బీర ఇతర పంటలను ముంచెత్తుతుంది, అన్నదాతలు విద్యుత్ మోటార్లు ఎడ్లబండ్లు ఇతర సామగ్రిని సురక్షిత ప్రాంతానికి చేర వేసుకుంటున్నారు. పల్లె ప్రాంతాల్లో ఉన్న వరి గడ్డి వాము వేరే చోటికి తరలించి కొంటున్నారు.
కొద్ది మంది గ్రామస్తులు వరద మా ఇంటికి వస్తే గాని ఖాళీ చేయమని బిసి నుంచి కూర్చోవడంతో అధికారులు వారికి సర్ది చెప్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు

వాయిస్ బైట్స్
కె.కొత్తపాలెం హరిజన వాడ ప్రజలు
బొబ్బర్లంక గ్రామస్తులు

Body:గంట గంటకి పెరుగుతున్న వరద నీరు ముంపుకు గురవుతున్న గ్రామాలు

Conclusion:గంట గంటకి పెరుగుతున్న వరద నీరు ముంపుకు గురవుతున్న గ్రామాలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.