కృష్ణా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పరివర్తన కార్యక్రమం ద్వారా స్వచ్ఛందంగా నాటుసారా వృత్తి నుంచి బయటకు వచ్చిన కుటుంబాలకు చెందిన 170 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం ద్వారా సంపూర్ణంగా నాటు సారాను నిరోధించలేమనే భావనతో జిల్లా ఎస్పీ రవీంధ్రనాథ్ బాబు పరివర్తన కార్యక్రమం చేపట్టారు. దీని ద్వారా బందర్, గుడివాడ, నూజివీడు తదితర సబ్ డివిజన్లలోని వందలాది కుటుంబాలను సారా తయారీ నుంచి స్వచ్ఛంధంగా బయటకు తీసుకురాగలిగారు.
ఆయా కుటుంబాల్లోని అర్హులైన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఎస్పీ వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. మచిలీపట్నం ఆర్కే పారడైజ్లో జాబ్ మేళా నిర్వహించారు. ఇందులో 170 మంది ఉద్యోగాలు సాధించారు. రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ముఖ్యఅతిథిగా పాల్గొని ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో ఆదర్శంగా పరివర్తన కార్యక్రమం నిలుస్తుందని మంత్రి అన్నారు.
ఇవీ చదవండి..
మందాకిని బొగ్గు గని కర్ణాటకకు.. సీఎం లేఖ రాసినా పరిగణనలోకి తీసుకోని కేంద్రం