కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పంచాయతీ కార్యాలయంలో అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. గ్రామ కార్యదర్శి కోటయ్య 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. గ్రామానికి చెందిన లింగం శేఖర్ అనే వ్యక్తి తమ ఇంటి ముందు మురుగు కాలువ తీయాలని కార్యదర్శిని కోరారు. మురుగు కాల్వ ఏర్పాటు చేయాలంటే తమకు పదహారువేలు లంచం ఇవ్వాలని కార్యదర్శి కోటయ్య డిమాండ్ చేశారు. మధ్యవర్తి ఒప్పందంతో 10 వేల రూపాయిలు ఇచ్చేందుకు ఒప్పుకున్న శేఖర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. శేఖర్ 10,000 మొత్తాన్ని పంచాయతీ కార్యాలయంలో కోటయ్య ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కార్యదర్శి కోటయ్య పైకేసు నమోదు చేసి రికార్డులను తనిఖీ చేస్తున్నామని అనిశా ఏఎస్పీ మహేశ్వర రాజు తెలిపారు.
ఇదీ చదవండి: చమురు ధరల పెంపుపై.. వాహనాన్ని దున్నపోతుతో లాగిస్తూ నిరసన