ETV Bharat / state

4 దశల్లో పంచాయతీ పోరు...జనవరి 23 నుంచే ఎన్నికలు - local body election news

రాష్ట్రంలో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. ఎన్నికలు నిర్వహణకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 4 దశల్లో పోలింగ్ జరపాలని నిర్ణయించి.... ఎన్నికల ప్రక్రియలోని వివిధ తేదీలను ప్రకటించింది. షెడ్యూల్ విడుదల కావడంతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎస్ఈసీ తెలిపింది.

Panchayat Election Schedule Release in AP
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
author img

By

Published : Jan 9, 2021, 10:26 AM IST

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) శుక్రవారం రాత్రి ప్రకటించింది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 మధ్య నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించడానికి ముందు కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌.. శుక్రవారం సాయంత్రం ఎస్‌ఈసీ కార్యాలయానికి వెళ్లి రమేశ్‌ కుమార్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది.

Panchayat Election Schedule Release in AP
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కరోనా నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కేంద్రం జారీ చేసిన నియంత్రణ చర్యలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయని, మరో పక్క కరోనా కొత్త స్ట్రెయిన్‌ కేసుల ముప్పూ పొంచి ఉందని, కరోనా టీకా వేసే సన్నద్ధతలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందే టీకా వేసే ప్రక్రియలోనూ పాల్గొనాల్సి ఉన్నందున పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని అధికారులు తెలిపారు. ప్రభుత్వ వాదన అదే అయినప్పుడు.. తాను కోర్టు ఆదేశాలు, నిబంధనల మేరకు తన విధిని నిర్వర్తిస్తానని రమేశ్‌ కుమార్‌ వారికి స్పష్టం చేశారు. భేటీ ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే పంచాయతీ ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తూ.. 8 పేజీల ప్రొసీడింగ్స్‌ను ఆయన విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులు ముగ్గురు ఎస్‌ఈసీతో చర్చించాలని హైకోర్టు ఆదేశించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, ఎస్‌ఈసీకి, సీఎస్‌కు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను రమేశ్‌ కుమార్‌ తన ప్రొసీడింగ్స్‌లో ప్రస్తావించారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడాన్ని, ప్రభుత్వం చెప్పిన కారణాలన్నిటినీ ఆయన తోసిపుచ్చారు. పంచాయతీ ఎన్నికల్ని తక్షణం నిర్వహించాల్సిన అవసరమేంటో వివరించారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం గతంలో ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్‌ ఇవ్వడానికి ముందు.. వివిధ పార్టీలతో సమావేశమై, వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే ఆ నిర్ణయానికి వచ్చిందని తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్వేచ్ఛగా, సక్రమంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఎస్‌ఈసీ కృతనిశ్చయంతో ఉందని స్పష్టంచేశారు.

టీకా పంపిణీ పూర్తయ్యేవరకు ఎన్నికలను వాయిదా వేయలేం

'కరోనా సెకండ్‌వేవ్‌ అవకాశం ఉందని, శీతాకాలంలో కరోనా కేసులు ఉద్ధృతమయ్యే అవకాశముందని ప్రభుత్వం చెప్పింది. కానీ ఎస్‌ఈసీ ఎప్పటికప్పుడు ఆయా రంగాల నిపుణుల నుంచి సమాచారం తీసుకుంటూనే ఉంది. ఎన్నికలు వాయిదా వేయించేందుకే ప్రభుత్వం ఈ కారణాలు చెప్పింది. కరోనా కొత్త స్ట్రెయిన్‌ కేసు రాజమహేంద్రవరంలో ఒక్కటే గుర్తించారు. ప్రభుత్వం మరో దారి లేక ఎన్నికలు వాయిదా వేయించడానికి టీకా పంపిణీని కారణంగా చూపుతోంది. గతంలో ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో, ఇప్పుడు ఎన్నికలు వాయిదా వేయించేందుకూ అంతే పట్టుదలతో ఉంది’ అని ప్రొసీడింగ్స్‌లో ఎస్‌ఈసీ పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కేటగిరీ-1, కేటగిరీ-2 టీకాలకే సిద్ధమవుతోంది. కేటగిరీ-3 టీకా గురించి ఇప్పటివరకు ప్రకటించలేదు. మొదటి రెండు దశల్లో రాష్ట్రంలో 3.7-7 లక్షల మందికే టీకాలు వేసే అవకాశం ఉంది. అది ఎన్నికల ప్రక్రియకు అడ్డం కాదు. కేంద్రం మొదటి దశ టీకాలను సెప్టెంబరు 2021కి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. టీకాలు ఇవ్వడం నిరంతర ప్రక్రియ. ప్రజారోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. టీకా ప్రక్రియ 2022లోనూ కొనసాగుతుంది. అప్పటివరకు ఎన్నికలను, ప్రజాస్వామ్య ప్రక్రియను ఆపలేం. రాజ్యాంగ నిబంధనలు, వివిధ కేసుల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు దానికి అంగీకరించవు’ అని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి సహకరించాలనే..

టీకాలు, కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలన్న ఉద్దేశంతోనే పంచాయతీ ఎన్నికలను ముందు అనుకున్న తేదీ కంటే ముందుకు జరిపామని ఎన్నికల కమిషనర్‌ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి రెండు/మూడు వారాల్లో ప్రారంభించి, మార్చిలో ముగించాలని గతంలో అనుకున్నామని, కానీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రక్రియను ముందుకు జరిపామని, ఫిబ్రవరి 17కే ముగించాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కొన్ని సూచనలు చేశారు. అవి..
* ఎన్నికల సిబ్బందికి నాణ్యమైన పీపీఈ సూట్‌లు, ఫేస్‌షీల్డులు గ్లోవ్‌లు, డిస్‌ ఇన్‌ఫెక్టెంట్‌లు ఇవ్వాలి. మొదటి విడతలో టీకా ఇచ్చే ప్రాధాన్య విభాగాల్లో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందినీ చేర్చాలి. దీన్ని ప్రత్యేకకేసుగా పరిగణించాలి.
* కరోనా వైరస్‌ సోకిన ఓటర్లకు చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలి. దాని కోసం పోలింగ్‌ సమయాన్ని పొడిగించాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది.
* రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరించాలి. ఎలాంటి శషభిషలకూ తావులేకుండా, ఎన్నికల్ని ఆపాలనో, ముందుకీ, వెనక్కీ జరపాలనో ఆలోచన లేకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపించాలి. హైకోర్టు తీర్పునకు కట్టుబడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
* రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలకు.. ఎన్నికల ప్రక్రియను ముందుకు జరపడం ద్వారా ఎస్‌ఈసీ పరిష్కారం చూపింది.
* గతంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిర్వహించినప్పుడు.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. ఈసారి కూడా అందుకు అవకాశం లేకపోదు. దాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం, పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
* ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై త్వరలోనే సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తాం.
* ప్రభుత్వ యంత్రాంగంపై ఎస్‌ఈసీకి పూర్తి భరోసా ఉంది. దేశంలో అత్యుత్తమ అధికారులు రాష్ట్రంలో ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి సవాల్‌ ఎదురైనా వారు దీటుగా ఎదుర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలోనూ అదే స్ఫూర్తి కనబరుస్తారని ఎన్నికల సంఘం ఆకాంక్షిస్తోంది.

ఇదీ చదవండి:

ఎస్‌ఈసీ నిర్ణయం.. సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనే: ద్వివేది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.