కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ మీటింగ్ నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి గ్రామ కమిటీని ఏర్పాటు చేసి పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఇంటివద్దే వైద్య సేవలు అందేటట్లు చూడాలని వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు సూచించారు. ఆసుపత్రులన్నీ రోగులతో నిండాయని చెప్పారు.
ఉన్నతాధికారులతో సంప్రదించి వ్యాక్సినేషన్ పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని.. పరీక్షలు పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. నియోజకవర్గంలోని కరోనా బాధితులకు వైద్య సేవలు అందించేందుకు తాత్కాలిక హాస్పటల్ ఏర్పాటుకు త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: కరోనా వేళ కొందరి నిర్లక్ష్యం... అందరికీ ప్రాణ సంకటం!