ETV Bharat / state

నిలిచిన ధాన్యం కొనుగోళ్లు..ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహం - ఏపీలో ధాన్యం కొనుగోళ్లు

ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం వైపు నుంచి చర్యలు కొరవడ్డాయి. దళారులేమో సగం ధరకే కొట్టేసేందుకు కాచుక్కూర్చున్నారు. అకాల వర్షాల ధాటికి కళ్లాల్లోని ధాన్యాన్ని కాపాడుకోవడం రైతులకు శక్తికి మించిన పనిగా మారింది. పంట అమ్ముడుపోక కృష్ణా జిల్లా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

నిలిచిన ధాన్యం కొనుగోళ్లు
నిలిచిన ధాన్యం కొనుగోళ్లు
author img

By

Published : May 13, 2021, 4:51 AM IST

కృష్ణా జిల్లాలో రబీ పంటకోతలు పూర్తయినా, ధాన్యం కొనే నాథుడు కనిపించక రైతులు మనోవేదనకు గురవుతున్నారు. జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటికే చాలాచోట్ల పంట కోతలు పూర్తికాగా...మరిన్ని ఎకరాల్లో కోతలు జరగాల్సి ఉంది. కోసిన పంట విక్రయించాక వచ్చే డబ్బులతో రెండో కోత చేపట్టి, అదే స్థలంలో నిల్వ చేసుకోవాల్సి ఉంది. వ్యవసాయ సహకార సంఘాలు, రైతుభరోసా కేంద్రాల వద్దకు వెళ్లి కొనుగోలు చేయాలని కోరుతున్నా, తగిన సమాధానం ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. ఖాళీ గోనె సంచులు లేవంటూ కుంటిసాకులు చెబుతున్నారని అంటున్నారు. నూక సాకుతో మిల్లర్లు కూడా ధాన్యం తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదంటున్నారు.

కళ్లాల్లో ధాన్యపు రాశులు నిల్వ చేసిన వేళ కురుస్తున్న అకాల వర్షాలు...మరింత సమస్యగా మారాయి. విజయవాడ నగర శివారులోని నున్న, కొత్తూరు తాడేపల్లి, వెలగలేరు, రామవరప్పాడు, వణుకూరు, పునాదిపాడు ప్రాంతాల్లో ఎటుచూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గత 2 వారాల్లో నాలుగుసార్లు సాయంత్రం పూట వానలు కురవగా...చాలాచోట్ల రోడ్లు, పంట పొలాలు, ఖాళీ ప్రదేశాల్లో ఆరబోసిన వరి తడిసిపోయింది. రేయింబవళ్లు ఆరబోసిన వడ్ల గురించి బెంగతో రైతులకు కంటిమీద కునుకే కరవైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ తీరుపై విమర్శలు వస్తున్నాయి.

విజయవాడ నగర శివార్లలో ఎటుచూసినా రోడ్లమీద ధాన్యం పెట్టుకొని కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న రైతులే కనిపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలుకు కాటాలు వేయించాలని రైతులు కోరుతున్నారు.

నిలిచిన ధాన్యం కొనుగోళ్లు..ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహం

ఇదీచదవండి

'మూతపడిన ప్లాంట్లు గుర్తిస్తున్నాం.. ఆక్సిజన్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.