ETV Bharat / state

రంగు మారిన ధాన్యం..కొనుగోలుకు షరతులు

నివర్​ తుపాన్​ కారణంగా చాలా పంట నష్టం జరిగింది. తడిసి.. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని అధికారులు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కేవలం 10శాతం లోపు రంగు మారిన గింజలు ఉంటేనే కొంటామనటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

paddy
రంగు మారిన ధాన్యం
author img

By

Published : Dec 28, 2020, 1:54 PM IST

‘రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తాం. నివర్‌ తుపాను, వర్షాల వల్ల తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేస్తాం..!’ జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర మంత్రి కొడాలి నానిలు ఇచ్చిన హామీ ఇది.

రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసేందుకు మార్గదర్శకాలు వచ్చాయి. క్వింటాకు రూ.94 తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. కేవలం 10శాతంలోపు రంగు మారిన గింజలు ఉంటేనే కొంటారు. కృష్ణాజిల్లా పెడన మండలం పెనుమల్లికి చెందిన మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ గరికపాటి చారుమతి తన పొలంలో పండించిన ధాన్యం పీపీసీకి తీసుకెళ్తే.. కొనుగోలు చేయబోమని తిరస్కరించారు. 10 శాతం కంటే ఎక్కువ రంగు మారిందని చెప్పారు. ఇదే గ్రామానికి చెందిన అజ్జా నాగేశ్వరరావు, శంకరరావు ధాన్యం కూడా తిరస్కరించడంతో అమ్ముకోలేని పరిస్థితి.

పామర్రు మండలం పసుమర్తి గ్రామానికి చెందిన రైతు 4 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత చెబుతామని కొనుగోలు కేంద్రంలో తిప్పిపంపారు. ధాన్యం వ్యాపారి దగ్గరకు వెళ్తే ఇతర ప్రాంతాల ధాన్యం అనుమతించడంలేదని నిరాకరించాడు. యలమంచిలి చిదంబర సీతారామారావు 10 ఎకరాలు సాగు చేశారు. అమ్ముడుపోక పది రోజుల నుంచి కల్లంలోనే ధాన్యం ఉంది. తడిసిన ధాన్యం రంగు మారడం సహజం. కానీ పది శాతం నిబంధన పెట్టడంతో రైతులకు ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది. రాష్ట్రం దాటి ధాన్యం రవాణా చేయకూడదనే షరతు ఉంది. దాదాపు 82,192 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రంగు మారితే... 5శాతం వరకు అనుమతిస్తారు. తర్వాత ఒక్క శాతానికి రూ.18.88 చొప్పున కోత విధిస్తున్నారు. 10 శాతంలోపు మాత్రం ఉంటేనే ఎఫ్‌సీఐ అనుమతిస్తుంది. జిల్లాలో 20 శాతం వరకు గరిష్ఠంగా ఉంటుంది. పీపీసీలలో తేమ 17 శాతం, రంగు మారిన గింజలు 5 శాతం, తాలు మూడు శాతం, ఇతర జాతి గింజలు 6 శాతం వరకు ఉంటేనే అనుమతిస్తారు. వీటిలో తాలు ఉన్నా లేకున్నా బస్తాకు కేజీ చొప్పున తీస్తున్నారు. 17 శాతం తేమ ఉన్నా.. తరుగు పేరుతో 2 కేజీలు తీస్తున్నారు. జిల్లాలో నవంబరు 6న పీపీసీలు ప్రారంభించారు. ఇప్పటి వరకు కేవలం 1.73లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. దీని విలువ రూ.326.84కోట్లు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో అధికారుల అంచనా ప్రకారం దిగుబడి 16,15,077 టన్నుల ధాన్యం వస్తుందని ఆశించారు. దీనిలో దాదాపు 10.10లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో లక్ష్యం నెరవేరుతుందా..? అంటే అనుమానమేనని అధికారులు అంటున్నారు.

ప్రత్యామ్నాయం?
రంగు మారిన ధాన్యం మిల్లు ఆడించడం వల్ల రంగు మారిన బియ్యం వస్తాయి. వీటిని ఎఫ్‌సీఐ వారు అనుమతించరని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర అవసరాలు మినహా మిగిలిన బియ్యం ఎఫ్‌సీఐకే ఇవ్వాలి. ఇతర ప్రత్యామ్నాయాలను చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై జేసీ మాధవీలతను వివరణ కోరగా పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించామని, నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: బియ్యం కార్డు సమస్యలా?? ఇవిగో పరిష్కారాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.