రాయితీ ఉల్లి కోసం కృష్ణా జిల్లా దివిసీమ పల్లె ప్రజలు... కూలీ పనులు మానుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే రాయితీ ఉల్లి కేంద్రం వద్ద బారులు తీరుతున్నారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాలకు చల్లపల్లిలో ఉన్న రైతు బజార్ ఒక్కటే దిక్కయింది. సూర్యోదయం కాకముందే 90 గ్రామాల ప్రజలు చల్లపల్లి రైతు బజార్ వద్దకు చేరుకుంటున్నారు. క్యూలైన్లో గంటల తరబడి నిలబడుతూ... అవస్థలు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి: