ETV Bharat / state

'ఉల్లి పరుగుకు ప్రభుత్వం కళ్లెం' - ఉల్లి ధర

కొయ్యకుండానే ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. కేవలం నెలరోజుల వ్యవధిలోనే ధర మూడింతలు పెరిగింది. పట్టపగ్గాల్లేకుండా పోతున్న ఉల్లికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలకు శ్రీకారం చుట్టింది.

onion-rates-hike
author img

By

Published : Sep 27, 2019, 9:40 AM IST

Updated : Sep 27, 2019, 10:54 AM IST

కొయ్యకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. నెలరోజుల కిందటి వరకు రైతు బజార్లలో కిలో 16 నుంచి 20 రూపాయలు పలికిన ధర... ప్రస్తుతం 55 రూపాయలు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో 60రూపాయలు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉల్లిపంట తీవ్రంగా దెబ్బతింది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా ఒక్కసారిగా ధరలకు రెక్కలొచ్చాయి. దక్షిణాది రాష్ట్రాల్లో సైతం వర్షా భావంతో ఉత్పత్తి తగ్గింది. ఉన్న కొద్దిపాటి సరుకును... డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు ధరలు పెంచుతున్నారు.

సామాన్యులకు అందకుండా పోతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై దాడులు నిర్వహిస్తూనే.. డిమాండ్‌కు తగ్గట్టు ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి... కిలో 25 రూపాయలకు ఇస్తోంది. రాయితీపై వస్తున్న ఉల్లిపాయలను కొనుక్కునేందుకు రైతు బజార్ల వద్ద ప్రజలు బారులు తీరారు. ధరలు అదుపులోకి వచ్చేవరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా రాయితీపై అందిస్తామని కృష్ణా జిల్లా అధికారులు తెలిపారు. మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకు ప్రభుత్వం ఉల్లిని అందించడంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలోనూ సామాన్యులకు ఉల్లిని అందించేందుకు అధికారులు.... ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో 25 రూపాయలకే కిలో అందిస్తున్నట్లు కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఒక్కో రేషన్‌ కార్డుకి కిలో చొప్పున అందిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 27 నుంచి నంద్యాల, ఆదోని రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిని విక్రయిస్తామని చెప్పారు. రేషన్‌ కార్డుకు కిలో చొప్పున రాయితీ ఉల్లిని అందిస్తున్న అధికారులు... దాన్ని రెండు కేజీలకు పెంచాలని వినియోగదారులు కోరుతున్నారు.

Intro:Ap_gnt_63_26_auto_tisukellaru_purugu_mandu_tagadu_av_AP10034

Contributor : k. Vara prasad ( prathi padu ),guntur

Anchor : ఆటో నడుపుకుంటూ....వచ్చిన కొంత సంపాదనతో భార్య ,పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. ఆటోకి నెల నెల ఫైనాన్స్ చెల్లించాల్సి ఉండగా...ఆర్ధికంగా ఇబ్బందులు ఉండి నగదు చెల్లించలేదు. దింతో ఫైనాన్స్ వారు ఆటో తీసుకెళ్లడంతో మనస్తాపం చెంది మృతి చెందాడు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోండ్రుపాడుకు చెందిన వంకదారి శివయ్య ఏడాది క్రితం చిలకలూరిపేట లో లక్ష్మీ ఫైనాన్స్ వారి వద్ద సెకండ్ హ్యాండ్ ఆటో కొని నెల నెల 5300 చొప్పున కిస్తీ చెల్లిస్తున్నారు. గత రెండు నెలల నుంచి ఆర్ధికంగా ఇబ్బందులు ఉండటంతో కిస్తీ నగదు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ వారు ఆటో తీసుకెళ్లారు. ఫైనాన్స్ వారి వద్దకు వెళ్లి వారంలో 20 వేలు చెల్లిస్తాను, ఆటో ఇవ్వాలని కోరారు....ఫైనాన్స్ వారు మాత్రం 30 వేలు చెల్లించాలని అడగ్గా...చేసేదేమీ లేక ఊరిలో పరువు పోతుందని భావించి ....భార్యను పుట్టింటికి పంపించి అతను ఇంటికి వచ్చి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. Body:EndConclusion:End
Last Updated : Sep 27, 2019, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.