విజయవాడ రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. గన్నవరం వైపు వేగంగా వెళ్తున్న లారీ నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొనటంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. ఘటనాస్ధలానికి చేరుకున్న మాచవరం పోలీసులు... మృతుని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
కీసర టోల్ ప్లాజా వద్ద తనిఖీలు-100క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం