ETV Bharat / state

రోడ్డు దాటుతుంటే ఢీకొట్టిన కారు.. అనంత వాయువుల్లో ప్రాణాలు - ambarpet road accident news

కృష్ణా జిల్లా అంబర్​పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టటంతో ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.

road accident
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
author img

By

Published : Jan 19, 2021, 1:26 PM IST

కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబర్​పేట సత్య అమ్మవారి దేవాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని దాటేందుకు ప్రయత్నించిన ద్విచక్ర వాహనదారుడిని.. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చందర్లపాడు మండలం కోనపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనాస్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

ప్రమాదానికి కారణమైన కారును పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: క్యాప్​, మాస్క్​తో పోలీసులు గుర్తుపట్టకుండా బయటకొచ్చిన దేవినేని ఉమ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.