కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వెలువోలు బీసీ కాలనీకి చెందిన వృద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వేములమడ కృష్ణమూర్తి, లంకమ్మ దంపతులు గత ఎనిమిది సంవత్సరాలుగా వయోభారంతో బాధపడుతున్నారు. వీరికి సంతానం లేకపోవటంతో బంధువులు ఆసరాగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యాయత్నం చేశారు. సమాచారం అందుకున్న బంధువులు మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు.
ఇదీచదవండి.
ఇదీ చదవండీ... ఆధార్ సాయంతోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ!