కృష్ణా జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని నూజివీడు ఎమ్మెల్యే మేకాప్రతాప్ అప్పారావు పరిశీలించారు. అక్కడ రోగులకు పడకల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండి.. పోలీసులు, అధికారులకు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి..