ETV Bharat / politics

వాళ్లు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరం - ఎక్కడ దాక్కున్నా వదలం : హోంమంత్రి అనిత

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమని మంత్రి అనిత మండిపాటు - మహిళలపై పోస్టులు పెడితే వాళ్ల భరతం పడతామని హెచ్చరిక

Minister Anitha Warning to YSRCP Social Media Activists
Minister Anitha Warning to YSRCP Social Media Activists (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 7:44 PM IST

Minister Anitha Warning to YSRCP Social Media Activists : సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై చర్యల కోసం ఓ చట్టం తేవాలని భావిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై పోస్టులు పెడితే వాళ్ల భరతం పడతామని హెచ్చరించారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాజకీయ ముసుగులో సామాజిక మాధ్యమాల ద్వారా మహిళల పై దారుణమైన పోస్టులు పెట్టారు. జగన్ తన సొంత తల్లి, చెల్లిపై పోస్టులు పెట్టిన రవీంద్రరెడ్డిని వెనకేసుకువచ్చారని ధ్వజమెత్తారు.

దుర్మార్గుల్ని వదిలేయాలా? : వైఎస్సార్సీపీ పాలనలో రౌడీలకు రాజకీయ ముసుగు వేసింది జగనే అన్నారని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రతీ 8 గంటలకు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని ఆరోపించారు. చంద్రబాబు సతీమణి, పవన్ కల్యాణ్ కుమార్తెలపైనా, హోం మంత్రినైన తనపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై పెట్టిన అసభ్యకరమైన పోస్టులపై తాను గుండే ధైర్యంతో భరిస్తున్నా ఇతరులైతే ఆత్మహత్య చేసుకునేవారన్నారు. అలాంటి దుర్మార్గుల్ని చూస్తూ వదిలేయాలా ప్రశ్నించారు. జగన్ తన చెల్లి షర్మిలపై పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి షకీలా అనే పోస్టు పెట్టినా చూస్తూ ఊరుకున్నారని దుయ్యబట్టారు.

సీఎం ఆఫీస్​లో మంత్రులు పవన్, అనిత భేటీ - ఇద్దరూ ఏం చర్చించారంటే!

వైఎస్సార్సీపీ బ్యాచ్ పైశాచిక ఆనందం : ఐదేళ్ల పాలనను, ప్రజాస్వామ్యాన్ని జగన్ వెంటిలేటర్​పై పెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ పోలీసుల్ని తన ఇంటి కాపలా కోసం వేధింపుల కోసం వాడుకున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి ఇప్పుడు ఆ వ్యవస్థపై ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన ఎంత మందిని అరెస్టు చేశారో జగన్​కు గుర్తుందా అని నిలదీశారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైఎస్సార్సీపీ బ్యాచ్ పైశాచిక ఆనందం పొందుతోందని తెలిపారు. మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవాలా అని నిలదీశారు.

వివాదాలు సృష్టించే ప్రయత్నం : పరదాలు, చెట్లు కూలగొట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పాలన జగన్​ది అనిత అని విమర్శించారు. అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తులను అరెస్టు చేస్తే వారిని విడిపించడానికి జగన్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వైఎస్సారసీపీ కార్యకర్తలను హెచ్చరిస్తున్నానని, మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటామని స్పష్టం చేశారు. హోం మంత్రినైన తన పేరిట సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ఖాతా సృష్టించి వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. మహిళలపై వైఎస్సార్సీపీ పెట్టిన అభ్యంతర కరమైన పోస్టులను వెల్లడించడానికి మాకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. న్యాయమూర్తులపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టించిన ఘనత జగన్​దని మండిపడ్డారు.

"చంద్రబాబుకూ కోపం తెప్పించారుగా" - వాళ్లందరి కొవ్వు కరిగిస్తామని హెచ్చరించిన సీఎం

అసెంబ్లీకి రావాలని ఎవరూ ఆహ్వానించరు? : జగన్ హయాంలో రంగనాయకమ్మను, గౌతు శిరీషను అరెస్టు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయనకు నోటీసులు, వారంట్​లు గుర్తుకు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించక ముందు నుంచే పోలీసు శాఖ చాలా రోజుల నుంచే అంతర్గత విచారణ చేస్తోందన్నారు. ఎమ్మెల్యేను అసెంబ్లీకి రావాలని ఎవరూ ఆహ్వానించాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడాలన్న ఆలోచన సదరు ఎమ్మెల్యేకు ఉండాలని, బాధ్యతలేని వారు ఇంట్లో కూర్చొంటారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అంతా కలసి కట్టుగానే ఉన్నామని, ఎక్కడా ఎలాంటి వివాదమూ లేదని పేర్కొన్నారు.

సైకో పార్టీ సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది - ఆఖరికి తల్లిని, చెల్లిని వదల్లేదు: షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.