కృష్ణా జిల్లా నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకటప్రతాప్ అప్పారావు హనుమాన్ జంక్షన్ పోలీస్ సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం విషయంలో తెదేపాకు చెందిన గ్రామ సర్పంచ్ అరెపల్లి శ్రీనివాసరావుకి వైకాపా కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనపై వైకాపా కార్యకర్తలు ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో తాజా పరిస్థితి, సమాచారంపై హనుమాన్ జంక్షన్ సీఐ రమణతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే పలుమార్లు ఫోన్ చేశారు. సీఐ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే జంక్షన్ సర్కిల్ కార్యాలయానికి వచ్చారు. సీఐ లేకపోవడంతో అక్కడే బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అభిమానులు సర్కిల్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఇదీ చదవండి: కరోనా విలయతాండవం..శవపేటికలకు పెరిగిన డిమాండ్