కృష్ణాజిల్లాలో నందిగామలో ఇసుక కోసం వినియోగదారులు పడిగాపులు పడుతున్నారు. మండల కార్యాలయాల వద్ద ఉదయం నుంచే భారీగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో తోపులాటలు సైతం చోటుచేసుకుంటున్నాయి. కృష్ణా నదికి వరద రావడంతో మున్నేరుపై రెండు పార్టీలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం నందిగామ తాసిల్దార్ కార్యాలయం వద్ద రోజుకి 300ల ట్రాక్టర్‌లకే ఇసుక తీసుకేళ్లేందుకు కూపన్లు ఇవ్వడంతో కూలీలకు పనులు సైతం లేకుండా పోతున్నాయి. ఇదే అదునుగా భావించిన లోడింగ్ ముఠా రూ. 300 కు బదులు రూ.1000 రూపాయలు వసూలు చేసి వినియోగదారులను దోచుకుంటున్నారు. దీంతో ఇసుక కొనుగోలు చేసేందుకు కష్టంగా మారటంతో కాంట్రాక్టర్లు ఇంటి నిర్మాణ పనులు సైతం నిలిపి వేసుకుంటున్నారు. కొత్తగా వచ్చే ఇసుకపాలసీతో తమకు నష్టమే అని వినియోగదారులు వాపోతున్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం అసమర్ధతతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటురన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వినియోగదారులకు సక్రమంగా ఇసుక అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు.
ఇదీచూడండి.గంటా కుమర్తె ఇంటి కూల్చివేత ఉత్తర్వులపై హైకోర్టు స్టే పొడిగింపు