ETV Bharat / state

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీకి చర్యలు - వైద్యసిబ్బందిలో ఉద్యోగులు భర్తీ తాజావార్తలు

కరోనా దెబ్బకు అన్నీ కంపెనీలు ఉద్యోగులను ఇళ్లబాట పట్టించాయి. కొన్ని కంపెనీలైతే వేతనాల్లో కోత విధించాయి. కానీ వైద్యశాఖకు మాత్రం సిబ్బంది కొరత ఏర్పడింది. కృష్ణాజిల్లా పీహెచ్‌సీల్లో ఉన్న ఖాళీలను భర్తీచేయటానికి అధికార యంత్రాంగం కార్యాచరణ చేపట్టింది.

notification release for krishna dst  health department

author img

By

Published : Jun 26, 2020, 7:46 PM IST

కృష్ణా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆంక్షలు సడలించిన తరవాత వైరస్‌ మరింతగా విస్తరిస్తోందని అధికారులంటున్నారు. ఈ పరిస్థితి ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్యసిబ్బంది నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల కేవలం కొవిడ్‌ సేవలకు వినియోగించుకునేందుకు పలు ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నారు. తాజాగా ఈ సేవలతోపాటు జిల్లాలోని ఆయా పీహెచ్‌సీల్లో ఉన్న ఖాళీలను భర్తీచేయడానికి అధికార యంత్రాంగం కార్యాచరణ చేపట్టింది.

భర్తీకి ఏర్పాట్లు

జిల్లావ్యాప్తంగా ఉన్న 88 పీహెచ్‌సీల్లో వైద్యులు తగినంత మంది ఉన్నా.. సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆయా గ్రామాలకు కేటాయించిన ఏఎన్‌ఎంలు కొవిడ్‌ సర్వే తదితర విధుల్లో ఉండటంతో పలు చోట్ల వారి ఆవశ్యకత ఏర్పడింది. పరీక్షలు చేయటానికి ల్యాబ్‌ టెక్నీషియన్‌లు, మందులు పంపిణీ చేయటానికి ఫార్మసిస్ట్‌లు తదితర విభాగాల సిబ్బంది అవసరం ఏర్పడింది.

రేడియోగ్రాఫర్లు, వివిధ విభాగాల సహాయకుల పోస్టులు కూడా భర్తీ చేయటానికి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేయటంతో పాటు అదనంగా మరిన్ని పోస్టులు మంజూరు చేసింది. ఒప్పంద, పొరుగుసేవల ప్రాతిపదికన పనిచేయడానికి అర్హులైన వారినుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు విద్యార్హతలు, దరఖాస్తు చేసే విధానం తదితర వివరాలకోసం కృష్ణా.ఏపీ.జీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. సంబంధిత పత్రాలను కలిపి పూర్తిచేసిన దరఖాస్తులను జులై 24లోపు మచిలీపట్నంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలి.

పారదర్శకంగా నియామకాలు

ఒప్పంద ప్రాతిపదికన చేపట్టే ఈ నియామకాలు మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రమేష్ అన్నారు. పారదర్శకంగా భర్తీ చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాట్లు తెలిపారు. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయని... అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

ఇదీ చూడండి: ప్రజలకు ఏం చేయాలో భాజపాకు తెలుసు: కేంద్రమంత్రి నిర్మలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.