ETV Bharat / state

వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు లేవు: దేవాదాయశాఖ

వినాయక మండపాలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు లేవని దేవదాయశాఖ స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా వినాయక చవితి పూజలు నిర్వహించుకోవాలనీ.. ఆలయాల్లో కొవిడ్ నిబంధనల ప్రకారం పూజలు చేయాలని సూచించింది.

minister vellampalli
మంత్రి వెల్లంపల్లి
author img

By

Published : Aug 20, 2020, 7:42 AM IST

వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు లేవని దేవదాయశాఖ స్పష్టం చేసింది. వినాయక మండపాల అనుమతిపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెల్లంపల్లి సమీక్ష నిర్వహించారు. వినాయక మండపాల అనుమతుల విషయంలో పొరుగు రాష్ట్రాల్లోని పరిస్థితిపై ఆరా తీసిన ప్రభుత్వం.. రాష్ట్రంలో కూడా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలోని అదే విధానాన్ని పాటించాలని అధికారులు సూచనలు ఇచ్చారు. ఈ మేరకు బహిరంగ ప్రదేశాల్లో వినాయక వేడుకలు, ఊరేగింపులను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. నదులు, చెరువుల్లోనూ నిమజ్జనానికి అనుమతి ఇవ్వకూడదని దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగతంగా ఇళ్లల్లోనే వినాయక చవితి పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. ఆలయాల్లో కొవిడ్ నిబంధనల ప్రకారమే పది మందికి మించకుండా వినాయక చవితి పూజలు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని దేవదాయశాఖ స్పష్టం చేసింది. పూజా సామగ్రి కొనుగోలుకు దుకాణాలు, మార్కెట్లకు వెళ్లేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: విశాఖను రౌడీ దందాలకు అడ్డాగా మార్చారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.