కొవిడ్-19 సేవల్లో భాగంగా రూ.కోటి విలువైన మందులను ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తున్నట్లు నాట్కో ఫార్మా లిమిటెడ్ ఉపాధ్యక్షుడు నన్నపనేని సదాశివరావు తెలిపారు. ఈ మేరకు గురువారం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి లేఖ అందజేశారు. రక్తం గడ్డకట్టకుండా నివారించేందుకు ఉపయోగపడే అపిక్స్బాన్ 2.5 ఎంజీ మాత్రలను 9,984 బాటిల్స్ ద్వారా ఇవ్వనున్నారు. ఒక్కో దాంట్లో 30 మాత్రలు ఉంటాయి. ఎనోజాపారిన్ 60 ఎంజీ 4,800 ఇంజక్షన్ల(24 కార్టన్లు-ఒకోదాంట్లో 200)ను అందచేస్తున్నట్లు ప్రకటించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద వీటిని ఇస్తున్నట్లు తెలిపారు. నాట్కో సంస్థ ఔదార్యాన్ని జవహర్‌రెడ్డి అభినందించారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన జారీచేసింది.
ఇదీ చూడండి. 'రమేష్ ఆసుపత్రి యాజమాన్యం కోసం గాలిస్తున్నాం'