విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూడు రోజులపాటు నిర్వహించిన నటరాజస్వామి వారి ఆర్ద్రోత్సవాలు ముగిశాయి. శివ కామసుందరీ దేవ సమేత నటరాజ స్వామి వార్ల ఉత్సవమూర్తులకు భక్తుల సమక్షంలో కల్యాణాన్ని నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజున పూజాద్రవ్యాలు ఉంచిన పట్టు వస్త్రాన్ని మూటగా కట్టి మూడుసార్లు హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత అగ్నిదేవునికి సమర్పించారు. అనంతరం స్వామి వార్ల ఉత్సవమూర్తులకు పల్లకీ సేవ నిర్వహించారు.
ఇదీ చదవండి: వేడుకగా అశ్వర్థ నారాయణ కళ్యాణం