మంత్రి గౌతమ్ రెడ్డి అబుదాబి పర్యటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఖాళీ కుర్చీలకి ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడానికి గౌతమ్ రెడ్డి అబుదాబి వరకూ వెళ్లాలా? అంటూ సెటైర్లు విసిరారు. జగన్ గురించి పెద్దగా అబుదాబీలో ఎవరికీ తెలియదని మంత్రి సెలవివ్వడం స్పీచ్ కే హైలెట్ అని ఎద్దేవా చేశారు.
చెత్త పాలన, బెదిరింపుల దెబ్బకి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నాయని, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని లోకేశ్ దుయ్యబట్టారు. కొత్త కంపెనీలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం వైకాపాకు ఎలాగో చేతకాదన్నారు. కనీసం ఉన్న కంపెనీలు పోకుండా చూస్తే అదే పదివేలని హితవుపలికారు. అబుదాబి సమావేశానికి సంబంధించిన వీడియోలను లోకేశ్ విడుదల చేశారు.
ఇదీ చదవండి
New districts in AP: కొత్త జిల్లాల ఏర్పాటు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అసంతృప్తి!