తెదేపా నాయకులు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎండీ హిదాయత్ మరణం.. పార్టీకి తీరనిలోటని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ముస్లిం సమాజానికి అండగా నిలిచిన హిదాయత్ సేవలు చిరస్మరణీయమన్నారు.
ఎన్నో సంక్షేమ పథకాలతో మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తూనే, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అవిశ్రాంతంగా కష్టపడ్డారని కొనియాడారు. హిదాయత్ కుటుంబసభ్యులకు లోకేశ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఇవీ చూడండి: