ETV Bharat / state

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి: సీఎంకు లోకేశ్ లేఖ - భవన నిర్మాణ కార్మికుల వార్తలు

రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులకు వెతలు మొదలయ్యాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి జగన్​కు లోకేశ్ లేఖ రాశారు.

nara lokesh
nara lokesh
author img

By

Published : Jun 25, 2020, 11:27 AM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక నూతన పాలసీ అంటూ 4 నెలలు తాత్సరంచేసి 60మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేలా చేశారని నారా లోకేశ్ మండిపడ్డారు. కార్మికులను ఆదుకోవాలని సీఎం జగన్ కు లేఖరాశారు.

కొత్తగా తీసుకొచ్చిన ఇసుక పాలసీతో రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలకు సంబంధించిన ఇసుక మాఫియా కోట్లకు పడగలెత్తితే.. భవన నిర్మాణ రంగం కుప్పకూలిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఇసుక మాఫియా ఏ స్థాయిలో ఉందో తాజాగా ఓ మంత్రికి ఇసుక బదులు మట్టి పంపించిన ఘటనే నిదర్శనమన్నారు. ఇదంతా స్టాక్ యార్డు ముసుగులో జరుగుతున్న దోపిడీ అనీ.. అధికారులు, వైకాపా నేతలే ఇందులో సూత్రదారులన్నది స్పష్టమవుతోందని చెప్పారు.

ఇసుక అక్రమాలను సహించబోనని ప్రకటించిన సీఎం.. ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధిస్తే.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్నాయని గుర్తు చేశారు.

కేరళ రాష్ట్రం వలస కూలీలకు సకల సదుపాయాలు కల్పించి అండగా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భ‌వ‌న‌నిర్మాణ కార్మికుల‌కు ఒక్క‌ రూపాయి కేటాయించలేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను స్థానిక సంస్థ‌ల ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారని లోకేశ్ ఆరోపించారు.

కార్మికుల సంక్షేమ బోర్డు నుండి భవన నిర్మాణ కార్మికులకు ఆర్ధికసాయం అందించాలని ప్రతిపక్షాలు సూచించినా.. పట్టించుకోలేదన్నారు. కార్మికులకు అండగా నిలిచే సంక్షేమ మండలి బోర్డుకి పాలక మండలి లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

వెంటనే సంక్షేమ మండలి బోర్డును కార్మిక సంఘాల నాయకులతో ఏర్పాటు చేయాలని లోకేశ్ సూచించారు. కార్మికుల నుంచి వసూలు చేసిన సెస్ వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాలు.. నష్టాల్లో సూచీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.