అధికార పార్టీ నేతల అరాచకాలను బయటపెడుతున్నందుకు న్యాయమూర్తి రామకృష్ణని వేధిస్తూ భౌతికదాడి చేయడం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను బయటపెడుతున్నందుకు జగన్‌రెడ్డి దళితులపై కక్ష కట్టారని లోకేశ్ ధ్వజమెత్తారు.
అనంతపురం జిల్లాలో అధికార పార్టీ గుండాలు దళిత రైతులపై దాడి చేసి భూమి లాక్కోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. చిత్తూరులో న్యాయమూర్తి రామకృష్ణపై దాడి చేశారని మండిపడ్డారు.
మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌పై అక్రమ కేసులు పెట్టటం, అవినీతిని సహకరించలేదని అనితారాణిని వేధించారని విమర్శించారు. కచ్చులూరు బోటు ప్రమాదం వెనుక వాస్తవాలు బయట పెట్టినందుకు మాజీ ఎంపీ హర్ష కుమార్‌పై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంతో దళితుల భూములు లాక్కోంటున్నారని విమర్శించారు. దళితుల పై దాడులకు పాల్పడుతున్న వారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చూడండి: