కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామంలో ఇళ్ల స్థలాల లబ్దిదారులు ఆందోళనకు దిగారు. నాగాయలంకలో కొందరికి... మిగతా వారికి నాగాయలంక పక్కన ఉన్న వక్కపట్ల వారిపాలెంలో స్థలాలు ఎందుకు ఇస్తున్నారని స్థానిక అధికారులను ప్రశ్నించారు. అనంతరం అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. తమకు నాగాయలంకలోనే ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే నాగాయలంకలో స్థలాలు లేవని.. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.
ఇదీ చదవండి: