ETV Bharat / state

'సరిహద్దు ప్రాంతం వద్ద అక్రమ మద్యం, బెల్ట్​ షాపులపై ఉక్కుపాదం' - మైలవరం ఎమ్మెల్యే తాజా వార్తలు

ఆంధ్రా- తెలంగాణ సరిహద్దులో అక్రమ మద్యం, బెల్ట్​ షాపులపై దృష్టి సారిస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్​ తెలిపారు. తమ భూములను ఆంధ్రా ప్రాంత రైతులకు అద్దెకు ఇస్తే... ఇక్కడ ఉన్న ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామన్నారు. ఈ వ్యవహారంపై సరిహద్దు రైతులు సహకరించాలని కోరారు.

mylavaram mla vasanth krishna prasad talks on belt shops in border areas
సరిహద్దు వద్ద అక్రమ మద్యంపై ఎమ్మెల్యే వసంత్​ కృష్ణ ప్రసాద్​ ప్రసంగం
author img

By

Published : Jul 4, 2020, 11:36 AM IST

సరిహద్దు ప్రాంతం వద్ద అక్రమ మద్యం, బెల్ట్​ షాపులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. బెల్ట్ షాపుల వల్ల లా అండ్​ ఆర్డర్ సమస్య ఏర్పడుతుందని... దాని పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూములను ఆంధ్ర ప్రాంత రైతులు అద్దెకు ఇస్తే... ఇక్కడ వస్తున్న ప్రభుత్వ పథకాలను, ఈ క్రాప్​ నమోదు వారికి నిలిపి వేస్తామన్నారు. ఈ వ్యవహారంపై వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్టు తెలిపారు.

20 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి దేవినేని ఉమా... ఓటమి వల్ల ఏర్పడిన మానసిక స్థితి నుంచి తేరుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. నందిగామలో విలేకరి గంటా నవీన్ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న కొమ్మినేని రవిశంకర్ ఎవరి అనుచరుడంటూ దేవినేని ఉమాను ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

'హామీ ఇవ్వని పథకాలూ అమలు చేసిన ఘనత జగన్​దే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.