శ్రీరామసేన వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్... శ్రీవారి ఆలయాన్ని కాపాడటానికి 'సేవ్ తిరుపతి' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుపతి ఆస్తులను విక్రయించడానికి ఆంధ్ర ప్రభుత్వాన్ని అనుమతించవద్దని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి ఆలయ ఆస్తులను విక్రయిస్తే..దేవుడు శిక్షిస్తాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... మసీదులు, చర్చిల ఆస్తుల జోలికి వెళ్లడం లేదు. ఎల్లప్పుడూ వారి దృష్టి హిందూ దేవాలయాలపైనే ఉంటుంది. దేవుడిపై భక్తితో... భక్తులు వారి భూములను కానుకగా ఇస్తే... వాటిని అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. తిరుమల ఆలయం ఆంధ్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తి కాదు, ఇది మన దేశానికి చెందిన ఆస్తి. ఒకవేళ వారు ఆలయ ఆస్తులను అమ్మితే హిందూ ప్రజలంతా ఏకమై వారిని వ్యతిరేకిస్తారు.
- ప్రమోద్ ముతాలిక్
శ్రీవారి భూములను సంరక్షించుకోవటానికి ఆధ్యాత్మిక వ్యక్తులతో ఒక కమిటీ వేయాలని ముతాలిక్... ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు సూచించారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని గవర్నర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.