విజయవాడ శివారులో వ్యక్తి దారుణహత్య...ఎందుకంటే..! - కృష్ణాజిల్లా తాజా వార్తలు
విజయవాడ నగర శివారులో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేపాయి. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న మహేష్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. దీంతో మహేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నున్న అడ్డ రోడ్డు వద్ద స్నేహితులతో కలసి మద్యం సేవిస్తున్న మహేష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. వెంటనే అతని పక్కనే ఉన్న స్నేహితులు పారిపోగా... స్థానికంగా ఉన్న వ్యక్తులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడికి తీసుకెళ్లగానే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే కాల్పులకు గల కారణం ఎంటనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.