విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. స్థానిక సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతున్నారు. విజయవాడ 11వ డివిజన్లో తెదేపా అభ్యర్థి కేశినేని శ్వేత వీధి వీధి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తెదేపా చేసిన అభివృద్ధి చూసి ఓట్లు వేయమని ఓట్లు అడుగుతున్నారు. ఏడాదిన్నర కాలంలో వైకాపా ప్రభుత్వం విజయవాడ నగరానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం పేదలకు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటోందని.. అవి స్కీమ్లు కావని స్కామ్లని విమర్శించారు. విజయవాడ వైభవాన్ని పునర్ నిర్మిస్తామని కేశినేని శ్వేత చెప్పారు. నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా, మిత్ర పక్షం సీపీఐ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: