ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని శాసన మండలి సభ్యులు వైవీబీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా నందిగామలో మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన... సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గత ఏడాది 2వేల కోట్ల పనులు చేశారని, అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తెదేపా నాయకులనే కారణంతో నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా నిధులు విడుదల చేయకపోతే 'ఛలో అమరావతి' కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి