కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని జిల్లా ఆసుపత్రిని ప్రజల వైద్యపరమైన అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయనున్నట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. మచిలీపట్నంకు వైద్య కళాశాల మంజూరవ్వటంతో...కలెక్టర్ ఇంతియాజ్‌తో కలిసి ఆయన జిల్లా ఆసుపత్రిని సందర్శించి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. ఆసుపత్రి అవసరాలకు అనుగుణంగా..ప్లేట్‌లెట్స్ విడగొట్టేందుకు అవసరమైన యంత్ర పరికరాలు, క్యాన్సర్ నిర్దరణ కోసం రూ.3.50కోట్ల విలువైన ప్రత్యేక వాహనం త్వరలో సమకూరనున్నట్లు తెలిపారు. అన్ని హంగులతో వైద్య కళాశాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: