ETV Bharat / state

అతని పేరు కానిస్టేబుల్‌ పడాల్... పోలీసులకు హడల్ - పోలీసు స్టేషనుకు తరలిస్తుండగ పరారీ

సాధారణంగా పోలీసులంటే దొంగలు హడలెత్తిపోతారు. వృత్తిరీత్యా కానిస్టేబుల్ అయిన పడాల్​ అనే వ్యక్తి దొంగగా మారి పోలీసులను, దొంగలను పరుగెత్తిస్తున్నాడు. చాలా నేరాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అతను చిక్కినట్టే చిక్కి పరారయ్యాడు.

పడాల్
author img

By

Published : Oct 28, 2019, 7:40 AM IST

అతడు వృత్తి రీత్యా పోలీసు... కానీ ప్రవృత్తి నేరాలు చేయటం. అతడే కానిస్టేబుల్ పడాల్‌...ఇతని పేరు చెపితే చాలు పోలీసులు సైతం ఉలిక్కిపడతారు. తాజాగా గంజాయి కేసులో చిక్కిన పడాల్‌...జైలుకు తరలిస్తున్నప్పుడు పరారయ్యాడు. నిందితుడిని గాలించేందుకు 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

అతడి పేరు పడాల్... పోలీసులకు హడల్
నగరంలో గంజాయి తరలిస్తూ గన్నవరం పోలీసులకు పట్టుబడ్డ పడాల్‌ను... కోర్టు రిమాండ్ విధించింది. నిందితుడిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తీసుకెళ్తుండగా పరారయ్యాడు. అతని కోసం రెండు పోలీస్‌ బృందాలు గాలిస్తున్నాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఒక ఏఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లను విజయవాడ సీపీ సస్పెండ్ చేశారు.
పడాల్‌ కేసు దర్యాప్తులో ఎన్నో నిజాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. నేరాల చిట్టా ఒక్కొక్కటిగా బయట పడుతోందని తెలిపారు. విశాఖ జిల్లా చింతపల్లి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్​గా పని చేసినప్పుడు ఎసై తుపాకీ అపహరించాడు. దానితో బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని విచారణలో తేలింది. గంజాయి స్మగ్లర్ల, మావోయిస్టులతో సత్ససంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖ, ఒడిశా సరిహద్దుల్లో పని చేసినందున రెండు మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడని చెపుతున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి

విశాఖలో తీగ లాగితే... కోల్​కతాలో డొంక కదిలింది!

Intro:Body:

vja_17_27

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.