అమ్మఒడి పథకంలో ఎక్కువ మంది నగదు కావాలని కోరుకుంటున్నారు. రూ.50 వేలు రూ.60 వేలు విలువ చేసే ల్యాప్‌టాప్ ఒకేసారి ఇస్తాం.. ఆప్షన్ పెడితే సరిపోతుందని చెప్పినా నగదు కావాలని ఎక్కువ మంది కోరారు. జిల్లావ్యాప్తంగా 8 నుంచి ఇంటర్ విద్యార్థులు 1,97,800 మంది అమ్మఒడి లబ్ధి అందుకుంటున్నారు. వీరిలో 7,273 మంది ముందుగానే అభిప్రాయ సేకరణకు అనర్హులయ్యారు. మిగిలిన వారి నుంచి ఆప్షన్లు తీసుకోగా 1,08,230 మంది నగదు, 82,297 మంది ల్యాప్‌టాప్ కావాలంటూ ఆప్షన్ ఇచ్చారు. వారి వివరాల్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో వారికి అమ్మఒడి పథకం కింద లబ్ధికి బదులు ల్యాప్‌టాప్ అందించనున్నారు. కొవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ఆన్‌లైన్ విద్యాభ్యాసానికి ల్యాప్‌టాప్ దోహదపడుతుందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండీ.. తెదేపా నేత ఇంటిపై వైకాపా నేతల దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు