కృష్ణా జిల్లా.. మోపిదేవి శ్రీ వల్లీ, దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో.. స్వామివారి జన్మ నక్షత్రం, ఆషాఢ కృత్తిక మహోత్సవం సందర్భంగా అభిషేకాలు, అర్చనలు జరిపారు. శ్రీవల్లి, దేవసేనా అమ్మవార్లకు శాకంబరి అలంకరణ చేశారు. ఆలయంలో వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అలంకరించారు. కొవిడ్ వలన పూజల్లో పాల్గొనేందుకు భక్తులను అనుమతించలేదు.
రాష్ట్ర ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ సీతారామాంజనేయులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కలాం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో లీల కుమార్ స్వామి వారి చిత్రపటాన్ని ఆయనకు అందించారు. కృష్ణాజిల్లా డీఆర్వో ప్రసాద్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి: