కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి, భక్తులకు.. ప్రత్యక్ష పూజలు సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కాలసర్ప దోష నివారణ పూజలు, ఊంజల సేవ, అభిషేకం, గోపూడ నాగశిలల ప్రతిష్ట వంటి పూజలను ప్రత్యక్షంగా నిర్వహించేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పూజలు చేసేందుకు తక్కువ సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
నిత్య కళ్యాణం, మహోన్యాస పూర్వక రుద్రాభిషేకము, సహస్ర నామార్చన, స్వర్ణ బిల్వార్చన మెుదలైన పూజలు పరోక్షకంగా నిర్వహిచేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించి... సేవలు పొందవచ్చునని వివరించారు. భక్తులకు ఏమైనా పూజ విషయాలు తెలుసుకోవాలంటే 08671257240 నెంబర్కు ఫోన్ చేయవచ్చున్నారు. 10 సంవత్సరాల లోపు చిన్నారులకు... 65 సంవత్సరాలు వయసు పైబడిన వారికి ఆలయంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'నకిలీ సంఖ్యలతో ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు?'