ETV Bharat / state

'ఆర్మీ ఆసుపత్రి నివేదికపై సీఎం, హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదు?' - ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్సీ మంతెన సత్యనారయణ రాజు

నరసాపురం ఎంపీ రాఘరామపై జరిగింది ప్రభుత్వ ప్రాయోజిత దాడేనని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఆరోపించారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికపై సీఎం, హోం మంత్రి ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు
ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు
author img

By

Published : May 23, 2021, 12:03 PM IST

సైనిక ఆసుపత్రి నివేదికపై సీఎం, హోం మంత్రి ఎందుకు నోరు మెదపటం లేదని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ప్రశ్నించారు. రఘురామపై జరిగింది ప్రభుత్వ ప్రాయోజిత దాడే అని ఆరోపించారు. కేసుతో సంబంధమున్న పోలీసు అధికారులందరిపై వేటువేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీఐడీ కస్టడీలో రఘురామ పై థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగినట్లు ఆర్మీ ఆస్పత్రి నివేదికతో తేలిందని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ చట్టాలకు, ప్రజాస్వామ్య విలువలకు ఏనాడో పాతరేశారని మండిపడ్డారు.

ప్రభుత్వ లోపాలను పదేపదే ప్రశ్నిస్తున్న రఘురామపై కక్ష తీర్చుకునేందుకు తప్పుమీద తప్పులు చేశారని విమర్శించారు. హైకోర్టు, ఏసీబీ కోర్టు మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పులను లెక్కచేయకుండా జైలుకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామపై అనుచితంగా ప్రవర్తించినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్థారించినందున ఈ కేసును లోక్ సభ స్పీకర్ ప్రివిలేజ్ మోషన్ కింద పరిగణనలోకి తీసుకొని రాష్ట్రప్రభుత్వం, పోలీసు పెద్దలపై చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

వైద్యపరీక్షలపై తప్పుడు నివేదిక ఇచ్చిన గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్య బృందంపైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని మంతెన డిమాండ్ చేశారు. రఘురామ ప్రాణాలకు ఎటువంటి హాని జరిగినా ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

దేశంలో కొత్తగా 2.40 లక్షల కేసులు- 3,741 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.